గంజాయి కేసులో నలుగురి అరెస్ట్


Thu,November 7, 2019 01:51 AM

చెన్నారావుపేట, నవంబర్ 06 : గంజాయి కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని లింగగిరి గ్రామ శివారు తోపనగడ్డతండాలో ధారవతు బాలి ఇంటి వద్ద ములుగు మండలం సోమ్లాతండా(ముద్దునూర్‌తండా)కు చెందిన ధారవతు రవి, తోపనగడ్డతండాకు చెందిన భూక్య వెంకన్న, నెక్కొండ మండలం చిన్నకొర్పోలు గ్రామ శివారు చెరువుముందు తండా(చెర్లతండా)కు చెందిన గుగులోతు లకాన్, బానోతు హరి లక్షా 57వేల 500వి లువ చేసే 37కిలోల ఎండు గంజాయిని అమ్మకానికి తరలించడానికి రెండు బస్తాల్లో ప్యాక్ చేస్తుండగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం వచ్చిందన్నారు.

వెంటనే నెక్కొండ ఎస్సై నవీన్‌కుమార్ పోలీస్ సిబ్బందితో తోపనగడ్డతండాకు వెళ్లి బాలి ఇంటి పై దాడి చేసి ఎండు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బాలి, రవి, వెంకన్న, లకాన్‌ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించామన్నారు. బానోతు హరి పరారీలో ఉన్నాడన్నారు. బాలి, రవి, వెంకన్న, లకాన్ నలుగురిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో నెక్కొండ ఎస్సై నవీన్‌కుమార్, ఇన్‌చార్జి ఎస్సై మహ్మద్ షాఖాన్, సిబ్బంది రామకృష్ణ, తిరుపతి, ఉపేందర్, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...