కలెక్టరేట్‌లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన..


Thu,November 7, 2019 01:51 AM

పరకాల, నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనాన్ని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం హరిత, జేసీ మహేందర్‌రెడ్డి, డీఆర్వో హరిసింగ్, కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు విజయారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సోమ, మంగళవారాల్లో కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...