ప్రతిభతోనే జాతీయస్థాయిలో గుర్తింపు


Wed,October 23, 2019 01:40 AM

- ఈ-బైస్కిల్‌ను తయారు చేసిన విద్యార్థులను అభినందించిన ప్రజాప్రతినిధులు

ఐనవోలు, అక్టోబర్‌ 22 : విద్యార్థుల ప్రతిభతోనే పున్నేల్‌ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సర్పంచ్‌ కత్తి దేవేందర్‌ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగిన జాతీయస్థాయి సైన్స్‌ ఫేయిర్‌లో పున్నేల్‌ జెడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొని ఈ-బైస్కిల్‌ను ప్రదర్శించి ప్రతిభకనబర్చారు. మంగళవారం పాఠశాలలో హెచ్‌ఎం మాధవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఉస్మాన్‌అలీ, సర్పంచ్‌ కత్తి దేవేందర్‌ హాజరై విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగపడే ఈ-బైస్కిల్‌ను తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చాట్ల అరుణ, జిల్లా సైన్స్‌ అధికారి సురేశ్‌బాబు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సారయ్య, మాజీ చైర్మన్‌ ఎండీ చాంద్‌పాషా, గ్రామస్తులు కిషన్‌రావు, వేణుగోపాల్‌రావు, ఉపాధ్యాయులు రహమాన్‌, వీరయ్య, సుగుణాకర్‌రెడ్డి, వెంకటనారాయణ, స్వప్నకుమారి, మాధవి, శోభారాణి, శ్యాంప్రసాద్‌, శ్రీలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...