మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆర్పీల కృషి


Tue,October 22, 2019 03:30 AM

-ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీత
నర్సంపేట, నమస్తే తెలంగాణ : మహిళల ఆర్థిక స్వావలంబనకు మెప్మా ఆర్పీలు కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్‌కేవీ అనుబంధ సంఘం ఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం సునీత అన్నారు. సోమవారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో ఆర్పీల సంఘం వరంగల్ రూరల్ జిల్లా మహాసభ టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సునీత మా ట్లాడుతూ మహిళలను చైతన్య పర్చడంలో ఆర్పీలు ముందుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకాలను కిందిస్థాయి వరకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అది గుర్తించిన ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా మొదటి సా రిగా ప్రభుత్వ ఖజనా నుంచి బడ్జెట్‌ను కేటాయించి వేతనాలు ఇస్తున్నారని తెలిపా రు. అందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్పీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి నెలకు రూ.4 వేల గౌ రవ వే తనం, ఎస్‌ఎల్‌ఎఫ్ నుంచి రూ.2 వేలు మొత్తం రూ.6 వేలు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుందన్నారు. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 వేల మంది ఆర్పీలకు వేతనాలు విడుదల చేసిందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ, నల్ల భారతి, లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి, శ్రీలత, అనిత, కవిత, మహేశ్వ రీ, భోజ్య, అమరవాణి, రాణి, శ్రీదేవి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...