డీఎఫ్‌వో పురుషోత్తం


Tue,October 22, 2019 03:29 AM

ఖానాపురం, అక్టోబర్ 21 : పాకాల సరస్సు ఉధృతంగా మత్తడి పోస్తున్నందున పర్యాటకులు మత్తడిలోకి దిగి ప్రమాదాల బారిన పడొద్దని డీఎఫ్‌వో పురుషోత్తం సూచించారు. ఈ మేరకు డీఎఫ్‌వో సోమవారం అటవీ శాఖ సిబ్బందితో కలిసి పాకాల మత్తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాలకు విచ్చేసే పర్యాటకులు పోలీసులు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరికలను పాటించాలని కోరారు. పాకాలలో ప్లాస్టిక్‌ను నిషేధించినందున ప్టాస్టిక్ కవర్లు పడేయొ ద్దని, మద్యం సేవించొద్దని సూచించారు. నీటి ఉధృతి తగ్గేవరకు మత్తడిలోకి వెళ్లరాదని చెప్పారు. ఎవరైనా ప్రమాదం బారిన పడితే 180042555364 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేయాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో రమేశ్, డీఆర్వో ఇజాజ్ అహ్మద్, సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...