వర్షంతో మిర్చి పంటకు తీవ్రనష్టం


Tue,October 22, 2019 03:29 AM

దుగ్గొండి, అక్టోబర్ 21 : మండలంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఆరుకాలం కష్టించి పండించిన పంటలు చేతికందే సమయానికి అకాల వర్షంతో తీవ్ర పంట నష్టం జరిగింది. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వర్షానికి వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దుగ్గొండి మండలంలోని రేఖంపల్లి, చలపర్తి, వెంకటాపురం, మైసంపల్లి, తిమ్మంపేట, మహ్మదాపురం అడవిరంగాపురం, నాచినపల్లి, మహ్మదాపురం చలపర్తి, చాపలబండ, జీడికల్, తొగర్రాయి గ్రామాల్లో ని రైతులు కళ్లాల్లో ఆరబోసిన మక్కలు తడిసిపోవటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వర్షంతో తీరని నష్టం వాటిలిదని రైతులకు ఆవేదనర వ్యక్తం చేస్తున్నారు. పంటనష్టపోయిన, ఇళ్లు కూలిన బాధితులను ప్రభు త్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...