పాకాలలో ప్రమాద హెచ్చరిక ఫ్లెక్సీల ఏర్పాటు


Mon,October 21, 2019 05:04 AM

ఖానాపురం, అక్టోబర్20 : మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పలు చోట్ల ఆదివారం ఎస్సై మ్యాక అభినవ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాద హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పాకాల మత్తడి పోస్తున్నందున పర్యాటకులు అందులోకి దిగితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. పాకాల బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. పాకాల సరస్సులో మొసళ్లు ఉన్నందున సరస్సులోకి దిగరాదని, అదేవిధంగా సరస్సు శిఖంలో నిలబడి సెల్ఫీలు దిగరాదని సూచించారు. పాకాల ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...