-పీహెచ్సీలను మరింత బలోపేతం చేస్తాం
-వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
-ఇల్లందలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలందిస్తూ ఆరోగ్య తెలంగాణను తయారు చేయడమేప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ ఆవరణలో సర్పంచ్ సుంకరి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందడం గగనంగా మారిందన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోగానే విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలను కేటాయించారని గుర్తుచేశారు. గతంలో ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందక పోవడంతో ప్రజలు వెళ్లడం మానేశారన్నారు.
కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆస్పత్రులను ఆధునీకరించడంతోపాటు వైద్యులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాణ్యమైన మందులు, వసతులు కల్పిస్తుండడంతో పేదలంతా నేడు ప్రభుత్వ దవాఖానలకు వెళ్తున్నారన్నా రు. ఇందుకు ఉదాహరణగా వర్ధన్నపేట సీహెచ్సీనే చెప్పుకోవచ్చన్నారు. మండలాల పునర్వవస్థీకరణలో భాగం గా ఐనవోలు పీహెచ్సీని ఐనవోలు మండలానికే కేటాయించడంతో అర్బన్ జిల్లాకు వెళ్లిందన్నారు. చెప్పారు. దీంతో వర్ధన్నపేట మండల నైసర్గిక స్వరూపం ఆధారంగా ఇల్లంద, దమ్మన్నపేట గ్రామాలకు రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. తొలుత ఇల్లందలో పీహెచ్సీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దమ్మన్నపేట గ్రామానికి కూడా పీహెచ్సీని మంజూరు చేయించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అరూరి హామీ ఇచ్చారు.
వైద్యులు మెరుగైన సేవలందించాలి
జిల్లాలోనే ఇల్లంద పీహెచ్సీని ఆదర్శంగా తయారు చేసేలా నిత్యం వైద్యు లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ పేదలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. ఇల్లందలో అధునాతన, అన్ని వసతులు కలిగిన భవనంలో పీహెచ్సీని ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తే భవన ని ర్మాణం కోసం కూడా అనువైన స్థలం ఉందని స్థానికులు చెప్పారు. భవనం మంజూరు కాగానే నిర్మిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే, సిబ్బందితోపాటు ఇల్లంద సమీపంలోని 10 గ్రామాలకు కూడా పీహెచ్సీ అనువుగా అంటుందన్నారు. పీహెచ్సీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అట్టహాసంగా పీహెచ్సీ ప్రారంభం
ఇల్లందలో పీహెచ్సీని అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామంలో పీహెచ్సీ ఏర్పాటు చేసిన హాస్టల్ భవనంలో ఎమ్మెల్యే రమేశ్ సహకారంతో సర్పంచ్, ఎంపీటీసీలు నాలుగు రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేశారు. విశాలమైన గదులు, ఓపీ కోసం, వైద్యుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. విద్యుత్, నీటి వసతిని కూడా కల్పించారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆస్పత్రికి రాగానే డీఎంహెచ్వో మధుసూదన్తోపాటు సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీలు, ఇతర ప్రముఖులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మె ల్యే భవనంలో పూజలు చేసి పీహెచ్సీని ప్రారంభించారు. అలాగే పీహెచ్సీని మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు గ్రా మ ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్యామ నీరజ, ఎంపీటీసీలు గొడిశాల శ్రీనివాస్, పిట్టల జ్యోతి, కోఆప్షన్ సభ్యుడు సహీమ్పా షా, ఉపసర్పంచ్ రాజ్కుమార్సీహెచ్వో నెహ్రూనాయక్, పీహెచ్సీ వైద్యుడు జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.