ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం


Thu,October 17, 2019 03:41 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలందిస్తూ ఆరోగ్య తెలంగాణను తయారు చేయడమేప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ ఆవరణలో సర్పంచ్ సుంకరి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందడం గగనంగా మారిందన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోగానే విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలను కేటాయించారని గుర్తుచేశారు. గతంలో ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందక పోవడంతో ప్రజలు వెళ్లడం మానేశారన్నారు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆస్పత్రులను ఆధునీకరించడంతోపాటు వైద్యులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాణ్యమైన మందులు, వసతులు కల్పిస్తుండడంతో పేదలంతా నేడు ప్రభుత్వ దవాఖానలకు వెళ్తున్నారన్నా రు.

ఇందుకు ఉదాహరణగా వర్ధన్నపేట సీహెచ్‌సీనే చెప్పుకోవచ్చన్నారు. మండలాల పునర్వవస్థీకరణలో భాగం గా ఐనవోలు పీహెచ్‌సీని ఐనవోలు మండలానికే కేటాయించడంతో అర్బన్ జిల్లాకు వెళ్లిందన్నారు. చెప్పారు. దీంతో వర్ధన్నపేట మండల నైసర్గిక స్వరూపం ఆధారంగా ఇల్లంద, దమ్మన్నపేట గ్రామాలకు రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. తొలుత ఇల్లందలో పీహెచ్‌సీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దమ్మన్నపేట గ్రామానికి కూడా పీహెచ్‌సీని మంజూరు చేయించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అరూరి హామీ ఇచ్చారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...