త్వరలో అన్నీ గ్రామాలకు ట్రాక్టర్లు


Thu,October 17, 2019 03:35 AM

ధర్మసాగర్, అక్టోబర్ 16 : జనాభా ప్రాతిపాదికన మండలంలోని ప్రతి గ్రామానికి త్వరలో ట్రాక్టర్లను ఇవ్వనున్నట్లు ఎంపీడీవో జీ జవహర్‌రెడ్డి వెల్లడించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని గ్రామాల కార్యదర్శులు, సర్పంచ్‌లు, జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నుకున్న పలు రకాల కమిటీల సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మసాగర్ మండలంలో చేసిన పనితీరుకు జిల్లా కలెక్టర్ సైతం కితాబు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరం సమష్టిగా పని చేస్తేనే మన మండలానికి మంచి పేరు వచ్చిందని ఎంపీడీవో తెలిపారు. ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో పారిశుధ్యం పనుల ప్రక్రియను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల పెంపకం వాచర్స్ పని తీరును ఫీల్ఢ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పరిశీలిచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత, మండల పంచాయతీ అధికారి విమల, జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీవో సంపత్, కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...