నిరుపేదలకు భూ పంపిణీ


Sat,September 14, 2019 02:31 AM

-సాగుకు పనికొచ్చే భూములపై దృష్టి
-ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది
-జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి
-నాగారం, వెంకటాపురం, చౌటుపర్తిలో భూముల పరిశీలన

గీసుగొండ, సెప్టెంబర్ 13 : తెలంగాణ పల్లెల్లో వెలుగులు చిమ్మెలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ ధర్మారంలో శుక్రవారం కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

అభివృధ్ధే ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మేయర్ గుండాప్రకాశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మారం గ్రామంలో కార్పొరేషన్ భవనం నిర్మిస్తామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మొక్కలు నాటి వాటిని రక్షించాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ నుంచి మొక్కలను పంపిణీ చేస్తామని, నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డులను కూడా అందిస్తామన్నారు.

విలీన గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపడాలి
గ్రేటర్ విలీన గ్రామాల్లో వసతుల కల్పనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మేయర్ గుండాప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ధర్మారంలో గ్రామంలో వృద్ధుల ఆశ్రమాన్ని వారు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. తాగునీటి సౌకర్యంను కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు ఏ అవసరం ఉన్నా కార్పొరేషన్ నుంచి నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వృథాగా ఉన్న భవనాన్ని కమ్యూనిటీహాల్‌గా మార్చుకోవాలన్నారు. భవనం మరమ్మతుకు నిధులను కూడా కేటాయిస్తామన్నారు.

అనంతరం జరిగిన రెవెన్యూ భూపరిష్కార వేదికలో వారు పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలన్నారు. సదస్సులో కార్పొరేటర్ లింగం మౌనిక, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొంపల్లి ధర్మారాజు, ఆర్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రాజయ్య, నాయకులు సుంకరి శివ, గోపాల నవీన్‌రాజు, విజయ్‌బాబు, కృష్ణ, ప్రభాకర్, నర్సయ్య, లవ్‌రాజు, నాగరాజు పాల్గొన్నారు.

గ్రామాలు అద్దంలా తయారుకావాలి
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాలు అద్దంలా తయారు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను స్థానికులతో కలిసి ఆయన తొలగించారు. ప్రభుత్వం గ్రామాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈజీఎస్ నిధులను అన్ని పనులకు వాడుకోవాలనిఅధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఒక్కరోజు శ్రమదానం చేయాలని సూచించారు. జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, స్థానిక సర్పంచ్ దౌడు బాబు, వార్డు సభ్యులు రాజు, ఆనందం, ఎంపీడీవో రమేశ్, ఈవోపీఆర్డీ శేషాంజన్‌స్వామి, స్థానికులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...