రక్తహీనత నుంచి విద్యార్థులను కాపాడాలి


Sat,September 14, 2019 02:28 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ: విద్యార్థులను రక్తహీనత నుంచి కాపాడాలని పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్ సూచించారు. శుక్రవారం నర్సంపేటలో మహిళా డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం సందర్భంగా కిశోర బాలికలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోందన్నారు. రక్తహీనతకు గురికాకుండా ఉండాలని సూచించారు. ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తినాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రవీందర్, భూపేష్, అంగన్‌వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భారతి, శ్రీలత, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...