రేపు మెగా క్విజ్ పోటీలు


Sat,September 14, 2019 02:27 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ/ఖానాపురం : ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నర్సంపేటలోవిద్యార్థులకు మెగా క్విజ్, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలను నిర్వహించన్నట్లు అటవీశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఏడు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. నర్సంపేటలోని కేఎస్‌ఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99086 30528, 99639 91441, 73826 19309 నంబర్లలో సంప్రదిం చాలని కోరారు. కాగా, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 16న పాకాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...