18న పరకాలలో జిల్లా స్థాయి క్రీడలు


Sat,September 14, 2019 02:27 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 18న జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేన్ జిల్లా అధ్యక్షుడు బైరి ప్రేమ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సమావేశానికి ప్రేమ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్రీడలు జరుగుతాయన్నారు. 14 నుంచి 25 సంవత్సరాల లోపు వారు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న వారు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడలకు వచ్చేడప్పుడు తమవెంట ఆధార్‌కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. వివరాలకు 88974 04659, 95738 26626 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...