ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి


Sat,September 14, 2019 02:27 AM

నర్సంపేట రూరల్ : 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని మండల స్పెషలాఫీసర్, ఏడీఏ తోట శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 27 గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత వారం రోజులుగా అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీఏ తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.

ప్రజలందరి భాగస్వామ్యంతో అధికారులు ముందుకు సాగాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కోరారు. ప్రణాళికల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని వివరించారు. జిల్లాలోనే నర్సంపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. సదస్సులో ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ విజయ్‌భాస్కర్, ఎంపీపీ మోతె కళావతి, ఈవోపీఆర్డీ అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ప్రత్యేక అధికారులు సంజీవరెడ్డి, శ్రీధర్‌వర్మ, మెండు అశోక్, రజినీకాంత్, శ్రీనివాసరావు, భద్రు, మండల భరత్, రాధాకృష్ణారావు, వెంకట్‌రావు, కృష్ణకుమార్, ఝాన్సీ, పారిజాతం, పూల్‌సింగ్, చందన, ఉమారాణి, నితిన్, సందీప్, నవీన్, గునిగంటి రాజ్‌కుమార్, కుందేళ్ల మహేందర్, సత్యనారాయణ, సింధూకిరణ్మయి, సుష్మ, ఫాతిమామేరీ, జ్యోతి, అన్ని గ్రామాల పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...