రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి : జెడ్పీటీసీ


Sat,September 14, 2019 02:26 AM

దామెర, సెప్టెంబర్ 13: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని దామెర జెడ్పీటీసీ గరిగె కల్పన అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పత్తిపంటకు సోకే గులాబీ పురుగుల నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన లింగాకర్షక బుట్టలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా పంటలకు విత్తనాలను సబ్సిడీపై అందిస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. పత్తిరైతులు తమ పంటపొలాల్లో తప్పనిసరిగా లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ కాగితాల శంకర్ మాట్లాడుతూ యూరియాను ప్రభుత్వం అందుబాటు ఉంచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. ఏవో శ్వేత, ఏఈఓ పవన్, గరిగె కృష్ణమూర్తి, గడ్డం రాజు ఉన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...