గోకుల్‌నగర్‌లో ఘనంగా కృష్ణాష్టమి


Sun,August 25, 2019 02:55 AM

సిద్ధార్థనగర్, ఆగస్టు 24: సంస్కృతీ, సంప్రదాయాలను భా వి తరాలకు అందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం హన్మకొండ గోకుల్‌నగర్‌లోని పోచమ్మగుడి ఆవరణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను గోకుల్ యాదవ సంఘం, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే మన రాష్ట్ర పండుగలకు ప్రత్యేకత ఉందన్నారు. వాటిని భావి తరాలకు అందిచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నా రు. అనంతరం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను ఘనం గా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...