టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో ముందంజ


Sun,August 25, 2019 02:54 AM

భీమారం, ఆగస్టు 24: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో వర్ధన్నపేట నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం 54, 55, 57, 58 డివిజన్ల పార్టీ అధ్యక్షులు, కమిటీ స భ్యులు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారంలోపు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందిస్తే రాష్ట్రంలో వర్ధన్నపేట రెండో స్థానంలో ఉంటుందన్నారు. ఈనెల 30 తేదీ వరకు గ్రామ కమిటీలు, కాలనీ కమిటీల నియామకాలను చేపట్టాలని నాయకులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, రాజునాయక్, బానోత్ కల్పన, డివిజన్ అధ్యక్షులు బిల్లా ఉదయ్‌కుమార్ రె డ్డి, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, ధర్మనాయక్, వల్లల యాదగిరి, టీఆర్‌ఎ స్ నాయకులు చంద్రమోహన్, గడ్డం శివరాంప్రసాద్, దోమ కు మార్, చకిలం రాజేశ్వర్‌రావు, మునేంద్రనాథ్, రవీందర్, శ్రీధర్, రాజేశ్, రాజేందర్, ప్రమోద్, సతీశ్, సాంబరెడ్డి పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...