అరుణ్ జైట్లీ మృతికి బండా ప్రకాశ్ సంతాపం


Sun,August 25, 2019 02:53 AM

అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు 24: మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు అరుణ్‌జైట్లీ మృతిపై టీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్‌లీడర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఎల్‌ఎల్‌బీ చేసిన అరుణ్‌జైట్లీ కొద్ది రోజులు న్యాయవాదిగా సేవలు అందించారని, రాజకీయంగా పేరుగాంచిన మేధావులల్లో ఒకరన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి నేటి మోడీ ప్రభుత్వం వ రకు బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి కేంద్రమంత్రిగా దేశానికి సేవ లు అందించారన్నారు. ఎంతో ఆనుభవం ఉన్న వ్యక్తి మరణించడం దేశానికి తీరనిలోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలిపారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...