ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు సన్మానం


Sat,August 24, 2019 02:46 AM

దామెర, ఆగస్టు 23 : మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ నియమించిన విషయం విదితమే. బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిసిన వారిలో ఏనుమాముల మార్కెట్ మాజీ చైర్మన్ కొంపల్లి ధర్మరాజు, టీఆర్‌ఎస్ దామెర మండల ప్రధాన కార్యదర్శి దామెరుప్పుల శంకర్, తక్కళ్లపహాడ్ మాజీ సర్పంచ్ దాడి మల్లయ్య ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...