ఇండ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటా..


Sat,August 24, 2019 02:46 AM

ఆత్మకూరు : రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న 42 మంది బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే శుక్రవారం కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తప్పకుండా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తానని వారికి భరోసా కల్పించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ సంపత్‌కుమార్, డీఈలు లింగారెడ్డి, మాంగ్యానాయక్, ఆర్‌అండ్‌బీ డీఈ గౌస్, ఏఈలు కృష్ణయ్య, రాజేశ్, తహసీల్దార్ సత్యనారాయణరావు, ఎంపీడీవో నర్మద, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, సర్పంచ్ పర్వతగిరి రాజు, ఎంపీటీసీలు బయ్య రమ, అర్షం వరుణ్‌గాంధీ, టీఆర్‌ఎస్ నాయకులు సంపత్‌కుమార్, కాంతాల కేశవరెడ్డి, బొల్లోజు కుమారస్వామి, నాగనబోయిన సాంబయ్య, బాషబోయిన పైడి, బాషబోయిన సదానందం, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...