రోడ్డు పనుల్లో వేగం పెంచాలి


Sat,August 24, 2019 02:45 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల-హుజూరాబాద్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రోడ్డు నిర్మాణంలో అవుతున్న జాప్యంపై ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను సత్వరం పూర్తిచేయాలని అన్నారు. చాలా రోజులుగా రోడ్డు నిర్మాణంలో జాప్యం అవుతోందని, అధికారులు క్షేత్రస్థాయి సందర్శనలు చేసి నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు. సమావేశంలో డీఈలు గౌస్, రాజ్‌నాయక్, ఏఈలు గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...