విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి : ఎమ్మెల్యే పెద్ది


Sat,August 24, 2019 02:45 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శుక్రవారం నర్సంపేట సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల గురుకుల విద్యార్థులకు సంస్థ కార్యదర్శి ఆదేశాలతో డీపీఏపీ డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ ప్లే ప్రోగ్రాంలో భాగంగా క్రీడా పోటీలను నిర్వహించారు. కార్యక్రమాన్ని ఒలింపిక్ కాగడాను వెలిగించి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ జీ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏ క్రీడలపై ఆసక్తి ఉందో వ్యాయామ ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. ఆయా క్రీడల్లోనే విద్యార్థులకు మెళకువలు నేర్పించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డీ బాలరాజు, లక్ష్మయ్య, మహేశ్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఈశర్, సెక్రటరీ కోయిల శ్రీనివాస్, సమ్మయ్య పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...