పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బొజ్జం


Sat,August 24, 2019 02:44 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల వ్యవసాయ మార్కె ట్ కమిటీ పాలకవర్గం ఎట్టకేలకు కొలువుదీరింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన బొజ్జం రమేశ్ నియమితులయ్యారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌తోపా టు పాలకవర్గాన్ని శుక్రవారం ప్రభు త్వం జీవో ఆర్టీ 326 ద్వారా నియమించింది. చైర్మన్‌గా బొజ్జం రమేశ్, వైస్ చైర్మన్‌గా నందికొండ జైపాల్‌రెడ్డి, సభ్యులుగా పల్లెబోయిన సురేశ్, ఏరుకొండ ఆనందం, వలుపదాసు చంద్రమౌళి, జర్పుల తిరుప తి, మహ్మద్ రషీదాబేగం, దుప్పటి పో చాలు, పాత రాజు, సూరినేని స్వామిలతోపాటు శాయంపేట పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, పరకాల ఏడీఏ, పరకాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్/చైర్మన్లను సభ్యులుగా ప్రకటించింది.

వీరి పదవీకాలం సంవత్సరంపాటు కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొం ది. చాలా సంవత్సరాల తరువాత పరకాల ప్రాంతానికి చెందిన వారికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రావడంపై ఈప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు మంజూరు కావడంతో నూతన చైర్మన్ బొజ్జం రమేశ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి ఉత్తర్వులను అందుకున్నారు. రమేశ్ వెంట జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...