గిరిజన తండాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం


Fri,August 23, 2019 03:34 AM

రాష్ట్రంలోని గిరిజన తండాల అభివృద్ధే ప్రభు త్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పల్లార్‌గూడ పోచమ్మతండా రోడ్డును గురువారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. పల్లార్‌గూడ మహరాజ్‌తం డా నుంచి పోచమ్మతండా, జారుబండతండా రోడ్డును రూ.1.4కోట్లతో నూతనంగా వేసిన తారు రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం మా ట్లాడారు. రాష్ట్రంలోని తండాలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో ఆ తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా చేసివాటి అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు.

గతం లో మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు రోడ్డు సౌకర్యంలేక ఎంతో ఇబ్బందులు ప డ్డారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఇబ్బందులు కాకుండా తండాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి మనమందరం రుణపడి ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథ కాలు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ గుగులోత్ వీరమ్మ, సర్పంచ్‌లు కుమారస్వామి, బిచ్యానాయక్, ఎంపీడీవో మల్లేశం, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్‌అలి, నాయకులు గోపిసింగ్, రవి, నర్సింహ, మార్కండేయ, టీఆర్‌ఎస్ కార్య కర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...