అసంపూర్తి మరుగుదొడ్ల విషయంలో బాధ్యులకు నోటీసులు జారీ చేయాలి


Fri,August 23, 2019 03:34 AM

శాయంపేట, ఆగస్టు 22 : మరుగుదొడ్లకు సంబంధించి నిర్మించకుండా వదిలేసిన వాటిపై పాత సర్పంచ్‌లు, కార్యదర్శులు, పారిశుధ్య కమిటీలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. మండలంలోని నూర్జహాన్‌పల్లికి గురువారం కలెక్టర్ వచ్చిన సందర్భంగా కొందరు సర్పంచ్‌లు మరుగుదొడ్ల బిల్లులు లబ్ధిదారులకు అందలేదని ఆమెకు విన్నవించారు. దీంతో కలెక్టర్ స్పందించి అప్పట్లో మరుగుదొడ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు ఇచ్చారని, వారికి కొంత బిల్లు వెళ్లిందన్నారు. అది ఎంత వెళ్లిందోనన్న విషయాలపై విచారణ జరపాలని ఎంపీడీవో అనురాధను ఆదేశించారు. గ్రామంలో తప్పు జరిగిందంటే వారికి బిల్లు చెల్లించిన వారే బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు పాత సర్పంచ్, కార్యదర్శులతో పాటు అప్పటి కమిటీలకు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...