భావితరాలకు చక్కటి పర్యావరణం అందించాలి


Fri,August 23, 2019 03:33 AM

ఖానాపురం,ఆగస్టు 22 : భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించడానికే హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలకేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారానికి ఎమ్మెల్యే పెద్ది ముఖ్యఅతిధిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరు హరితహారంలో భాగస్వాములై మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.

అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హరితహారం విజయవంతానికి కృషి చేయాలని కోరారు. తహసీల్దార్ ముంతాజ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 4988 మొక్కలను 5 గ్రామాల్లో ఒకే రోజు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జెడ్పీటీసీ బత్తిని స్వప్న, నర్సంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, సర్పంచ్ శాఖమూరి చిరంజీవి, ఎంపీడీవో రవి, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, బొప్పిడి పూర్ణచందర్‌రావు, నాగార్జునరెడ్డి, దాసరి రమేశ్, వడ్డే వెంకటేష్, పూలు, గోనె యువరాజ్, ఉపసర్పంచ్ మేడిద కుమార్ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...