రైతులకు వరం.. పరిష్కార వేదికలు


Thu,August 22, 2019 02:58 AM

పరకాల, నమస్తే తెలంగాణ : రైతులు భూతగాదాలను పరిష్కరించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిరకాల పథకాలను పొందవచ్చని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో తహసీల్దార్ కోమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూసమస్య పరిష్కార వేదికకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామంలోని మొత్తం భూమి, అసైన్డ్, పట్టా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూసమస్య పరిష్కార వేదికలు రైతులకు వరంలాంటివన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సాదాబైనామా పథకానికి రూపకల్పన చేశారన్నారు. తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేసిన వారికి కూడా పట్టా పాస్‌పుస్తకాలు అందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ భూప్రక్షాళన చేయించి రెండో విడత భూసమస్య పరిష్కార వేదికలకు శ్రీకారం చుట్టారన్నారు. ఉన్నోళ్లకే హక్కు పత్రాలు వస్తున్నాయన్నారు.

తగాదాలకు వెళ్లి కోర్టుల చుట్టూ తిరిగితే రైతులు నష్టపోతారని, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే అధికారులు ఆ భూములకు హక్కు పత్రాలు కల్పిస్తారన్నారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అర్హులవుతారన్నారు. పరకాల నియోజకవర్గంలో సాదాబైనామా ద్వారా 92శాతం పట్టాలు చేశారన్నారు. మిగతా 8శాతం కూడా పరిష్కరించాలని సూచించారు. ఎవరికైనా రైతులకు సర్వేనెంబర్‌లో ఉన్నదానికంటే మోకాపై ఎక్కువ విస్తీర్ణం ఉంటే మండలం మొత్తం సభలు అయిపోయిన తర్వాత సీసీఎల్‌ఏ సెటిల్‌మెంట్ సర్వే ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కోర్టు తగాదాలో ఉన్న ఇరువురితో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మోకాపై ఎవరికెంత భూమి ఉంటే వారికి అధికారులు అంత రికార్డుల్లో నమోదు చేస్తారన్నారు. సాదాబైనామాలో మొత్తం భూమి పట్టాకు రావాలని, ప్రభుత్వ ఆస్తుల పేర్లను పహాణీలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పలువురు రైతులకు పట్టాపాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జెడ్పీటీసీ కోడెపాక సుమలత, పరకాల ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణ, జెడ్పీటీసీ చిలువేరు మొగిళి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ బొల్లె బిక్షపతి, చింతిరెడ్డి సాంబరెడ్డి, నడికూడ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, నర్సక్కపల్లి సర్పంచ్ తిప్పర్తి సాంబశివరెడ్డి, రాయపర్తి సర్పంచ్ రావుల సరిత, ఎంపీటీసీ పర్నెం శ్రీలత, మాజీ జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, టీఆర్‌ఎస్ నాయకులు పర్నెం తిరుపతిరెడ్డి, చెనుమల్ల సాంబరెడ్డి పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...