విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి


Thu,August 22, 2019 02:58 AM

దుగ్గొండి, ఆగస్టు21 : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎస్సై మచ్చ సాంబమూర్తి, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ అన్నారు. మండలంలోని గిర్నిబావి గురుకులంలో చదువుతున్న విద్యార్థులు జిల్లాస్థాయిలో జరిగే సైన్స్‌ఫేర్ పోటీలకు ఎంపిక కాగా బుధవారం ఉపాధ్యాయులతో కలిసి ఎస్సై మచ్చ సాంబమూర్తి ఆధ్వర్యంలో వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై మచ్చ సాంబమూర్తి, ప్రత్యేకాధికారి దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులంతా లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న మహానీయులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సైన్స్‌ఫేర్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థులను ఎస్సై, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు మానస, శ్రీదేవి, కోటి, శ్రీనివాస్, పీఈటీ బాబు, రమేశ్, ప్రేమలత, రోజా, బోధనేతర సిబ్బందిపాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...