మత్స్యకారులకు మంచిరోజులు


Wed,August 21, 2019 03:53 AM

నర్సంపేట రూరల్, ఆగస్టు 20 : మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం ముందుకు సాగుతుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. జిల్లాలోనే రెండో అతిపెద్ద చెరువైన నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువులో ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని నర్సంపేట ఆర్డీవో ఎన్ రవి, ఏడీఏ తోట శ్రీనివాసరావు, జడ్పీటీసీ కోమాండ్ల జయగోపాల్‌రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గుం టుక సోమయ్యతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. తొలుత చెరువు వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు, కుంకుమ, పూలను చెరువులో చల్లారు. అనంతరం ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 6,81,000 చేప పిల్లలను ఎమ్మెల్యే చెరువులోకి విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై అందిస్తున్న చేప పిల్లలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించడానికే ప్రభు త్వం వీటిని పంపిణీ చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప హృదయంతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. నర్సంపేట డివిజన్‌లో పేరుగాంచిన మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్‌లో ఆరు లక్షలకు పైగా చేప పిల్లలను పోసినట్లు తెలిపారు. ఇప్పటికే మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్‌లు, ట్రాలీలు అందించామన్నారు. అనతికాలంలో మరో 1000 మంది మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్‌లు, ట్రాలీఆటోలు అందించేందుకు ఆర్థిక అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మత్స్యకారులు చేపలు విక్రయించేందుకుగాను నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రత్యేక చేపల మార్కెట్లు, అంతేగాక నర్సంపేట పట్టణంలో కూడా ఫిష్ మార్కెట్ అనుమతులను తీసుకొస్తామన్నారు.

నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 296 చెరువులు, కుంటలు ఉన్నాయని, వీటన్నింటిలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, పుల్లూరి స్వామి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మచ్చిక నర్సయ్యగౌడ్, గూళ్ల అశోక్‌కుమార్, మాదన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, మాజీ సర్పంచ్ ఆకుతోట కుమారస్వామి, ఇటుకాలపల్లి ఎంపీటీసీ భూక్య వీరన్న, మాజీ ఎంపీటీసీ కట్ల సుధాకర్‌గౌడ్, సంఘం అధ్యక్షుడు జినుకల నర్సయ్య, మారపాక నర్సయ్య, మాజీ కౌన్సిలర్ నాయిని నర్సయ్య, తడిగొప్పుల మల్లేశ్, ఈర్ల నర్సింహరాములు, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, రంజిత్, రమేశ్, రాజు, బాబు, సాంబయ్య పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...