ఎరువుల కోసం రైతుల బారులు


Wed,August 21, 2019 03:50 AM

చెన్నారావుపేట,ఆగస్టు20: ఎరువుల కోసం రైతన్నలు బారులు తీరారు. మంగళవారం చెన్నారావుపేట సొసైటీ కార్యాలయం ఆవరణలో ఉన్న గోదాం వద్ద ఎరువుల కోసం అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రానున్న రోజుల్లో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత ఉంటుందని పెద్దెత్తున ప్రచారం కావడంతో ఉదయం 7 గంటలకే చుట్టు ప్రక్కల గ్రామాల రైతులు సొసైటీ గోదాం వద్దకు చేరుకొని క్యూలో నిలబడి వేచి చూశారు. అనంతరం గోదాం ఇన్‌చార్జి రాఘవులు అక్కడికి చేరుకుని రైతులకు కావాల్సిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను పంపిణీ చేశారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...