మహిళా వార్డెన్‌ను నియమించాలి


Wed,August 21, 2019 03:50 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ: బీసీ కళాశాల హాస్టల్‌కు మహిళా వార్డెన్‌ను నియమించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల నరేష్, గుర్జం అజయ్, మొగిలిచర్ల సందీప్ కోరారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ హాస్టల్ వార్డెన్ సెలవుపై వెళ్లారన్నారు. ఇటీవల నియమించిన వార్డెన్ పురుషుడు కావడంతో విద్యార్థినులు తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. ఈ మేరకు వెంటనే మహిళ వార్డెన్‌ను నియమించాలని కోరారు. కార్యక్రమంలో సందీప్,రవి, వంశీ, సంపత్, కవిత, అఖిల, సంధ్య పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...