విప్లవాత్మకమైన మార్పులు..


Sun,August 18, 2019 03:19 AM

-వినూత్న ఆలోచనతో ముందుకెళ్లాలి
-కెనరా బ్యాంకు వరంగల్ రీజియన్ సమీక్షలో వక్తలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై, వినూత్న ఆలోచనల రూపకల్పన కోసం వరంగల్ రీజియన్‌లోని 68 బ్యాంకు శాఖల మేనేజర్లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కెనరా బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఏజీఎం అలెగ్జాండర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలువురు వక్తలు బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. ఆయా బ్యాంకు శాఖల పనితీరుపై సమీక్షించుకుని బ్యాంకింగ్ రంగంలో ఎదురవుతున్న, ముందున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష, చర్చించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. తెలంగాణలో మొదటిసారిగా భవిష్యత్ ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమీక్ష జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.

వివి వర్గాలకు అందాల్సిన ఆర్థిక చేయూతను మెరుగుపరిచే విధానాలపై సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త పద్ధతుల్లో సమాచార విశ్లేషణ విధానాలను అనుసరించాలన్నారు. బ్యాంకింగ్ సేవలను పౌర సమాజానికి మరింత చేరువ చేయడంతోపాటు బాధ్యాతాయుతంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధివిధానాలపై విస్తృతంగా చర్చించారు. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై ప్రత్యేక నిపుణులు అందించిన తొమ్మిది ప్రధాన అంశాలపై కూడా చర్చ జరిగింది. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన మేనేజర్లతో డీజీఎం వెంకట్‌రెడ్డి, ఏజీఎం అలెగ్జాండర్, తెలంగాణ రాష్ట్ర ఖాదీ, పరిశ్రమల బోర్డు వరంగల్ రీజియనల్ ఆఫీసర్ అశోక్‌కుమార్, బ్యాంకు శాఖాధిపతులు పాల్గొని సలహాలు, సూచనలు స్వీకరించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...