భవనం మంజూరు చేయాలని వినతి


Sun,August 18, 2019 03:17 AM

చెన్నారావుపేట, ఆగస్టు 17 : ఉప్పరపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆ గ్రామ యువజన సంఘం నాయకులు పరికి మధూకర్, గొల్లపెల్లి స్వామి, కసరబోయిన రాజ్‌కుమార్, పులి స్వామి, మాడుగుల కుమారస్వామి కోరారు. ఈ మేరకు శనివారం చెన్నారావుపేటలో ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే నూతన భవనం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...