అంగన్‌వాడీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి


Sat,August 17, 2019 03:39 AM

-రాష్ట్ర ఫుడ్‌కమిషన్ సభ్యుడు సంగులాల్
చెన్నారావుపేట, ఆగస్టు 16 : అంగన్‌వాడీ కేం ద్రాల్లో టీచర్లు, ఆయాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బానోతు సంగులాల్ అన్నారు. శుక్రవారం చెన్నారావుపేట, జల్లికాలనీ, ఈర్యతండాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మింగా పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని రికార్డులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పెట్టే భోజనా న్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని ప్రతీ రోజు విధిగా అందించాలన్నారు. టీచర్లు, ఆయాలు విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ విజేందర్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాం రెడ్డి, సర్పంచ్ కుండె మల్లయ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మం జుల, జున్నుతుల శ్రీధర్‌రెడ్డి, కందకట్ల సాంబయ్య, అంగన్‌వాడీ టీచర్లు దేవమ్మ, సరోజన, లక్ష్మీబాయి పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...