ఘనంగా రక్షాబంధన్ వేడుకలు


Fri,August 16, 2019 04:51 AM

-ఊరూరా రాఖీ పండుగ
-ఆలయాల్లో మనగుడి కార్యక్రమాలు
-కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు

పరకాల/నర్సంపేట/వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : రక్షాబంధన్ వేడుకలు గురువారం జరిగాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతీ ఇంట్లో సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టారు. పండుగను పురస్కరించుకుని ఆడపడుచులు తమ పుట్టిళ్లకు చేరుకుని అన్నాదమ్ములను ఆప్యాయంగా పలకరించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పలుచోట్ల ఈ వేడుకల్లో కూడా రాఖీ పండుగ జరుపుకున్నారు. సాయంత్రం వరకు కూడా రాఖీలు కట్టుకోవడం కనిపించింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలతో పాటు గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి ఒకేరోజు రావడంతో పట్టణమంతా కోలాహలంగా మారింది.

పరకాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద ప్రజలు స్వీట్లు, రాఖీలను కొనుగోళ్లు చేయడం కనిపించింది. బస్టాండ్ ప్రాంతమంతా వచ్చిపోయే వారితో కోలాహలంగా కనిపించింది. బస్సులు కిక్కిరిసి పోయాయి. కాగా, వర్ధన్నపేట క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రమేశ్‌కు వైస్ ఎంపీపీ మార్గం సోమలక్ష్మి, మాజీ ఎంపీటీసీ రాజమణి, ఇతర టీఆర్‌ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు ఇల్లంద, కట్య్రాల, వర్ధన్నపేట గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సామూహిక రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, జెడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్‌కు కూడా సోదరీమణులు రాఖీలు కట్టారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...