శ్రీమత్స్యగిరిస్వామి ఆలయంలో ఘనంగా జంధ్యధారణ !


Fri,August 16, 2019 04:49 AM

శాయంపేట, ఆగస్టు 15 : మండల కేంద్రంలోని పురాతన శ్రీమత్స్యగిరిస్వామి దేవాలయంలో గురువారం జంధ్యధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జంధ్య పౌర్ణమి సందర్భంగా రాఖీ పండుగ రోజున జంధ్యాలను ధరించడం ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆలయ చైర్మన్ సామల భిక్షపతితోపాటు పలువురు గ్రామస్తులు జంధ్యాలను ధరించారు. కార్యక్రమంలో అర్చకులు కృష్ణమాచార్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...