కాళేశ్వరంలో గండ్ర జ్యోతి పూజలు


Wed,August 14, 2019 02:04 AM

కాళేశ్వరం, ఆగస్టు 13 : కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతితోపాటు జిల్లాలోని జెడ్పీటీసీలు మంగళవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన వారికి అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గణపతి వద్ద పూజ చేసి, స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. నుంచి పార్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనం చేశారు. ఇక్కడ కాళేశ్వరం ఎంపీటీసీ మమత తదితరులు ఉన్నారు. అనంతరం జెడ్పీటీసీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లింది. నేరుగా లక్ష్మీ పంప్‌హౌస్ వద్దకు చేరుకున్న వారికి వ్యూ పాయింట్ వద్ద ఇంజినీర్లు ప్రాజెక్టు గురించి వివరించారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ డెలివరీ స్నిస్టర్ వద్ద పరిశీలించారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా సరస్వతీ బరాజ్‌కు చేరుకున్నారు. అక్కడ ఇంజినీర్లు స్వాగతం పలికి బరాజ్ గురించి మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం లక్ష్మీబరాజ్‌కు వెళ్లారు. ఇక్కడ జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిని, జెడ్పీటీసీలు కల్పన, సుమలత, జయమ్మ, సాయిని విజయ, శోభ, రాధిక, గూడ సుదర్శన్‌రెడ్డి, రంగు కూమరస్వామి, పోలీస్ ధర్మారావు, భిక్షపతి, మొగిళి, గొర్రె సాగర్ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...