సాగునీటికి ఢోకాలేదు..


Wed,August 14, 2019 02:04 AM

పర్వతగిరి, ఆగస్టు 13 : తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి సాగునీటికి ఢోకా లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నీటి సమస్య లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. మంగళవారం మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామ శివారులో కట్టు కాల్వను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే పరమావదిగా సీఎం నిర్ణయాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆకేరు వాగు నుంచి ఇక్కడి చెరువులోకి సాగునీటిని అందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గొలుసు కట్టు చెరువులకు పూర్వవైభవం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు గొలుసు కట్టు ద్వారా కొత్తూరు, బందనపెల్లి, రావూరు, అన్నారం షరీఫ్ చెరువులు, కుంటల్లోకి నీటిని అందించనున్నట్లు వివరించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సింగ్‌లాల్, ఎంపీపీ కమల, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, నాయకులు చింతపట్ల సోమేశ్వర్‌రావు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, ఈరగాని సాంబయ్య, పట్టపురం ఏకాంతంగౌడ్, వెంకటరాజు, వెంకటేశ్వర్‌రావు, పంతులు నాయక్, జడల కృష్ణ, రాపోలు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...