హరిత తెలంగాణే లక్ష్యం


Wed,August 14, 2019 02:02 AM

సంగెం, ఆగస్టు 13 : మండలంలోని కాపులకనపర్తి గ్రామం లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటా రు. కాపులకనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు హరితహారంలో ప్రతి ఒక్క రూ భాగస్వాములై పచ్చని తెలంగాణగా మార్చడంలో తమ భూ మికను పోషించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీం కేసీఆర్ కలలు కన్న తెలంగాణ రూపకల్పణలో అందరం కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, సర్పంచ్ గోపాల్‌రావు, ఎంపీడీవో ఎన్ మల్లేశం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎంపీటీసీ పసునూరి సారంగపాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...