త్యాగనిరతికి ప్రతీక బక్రీద్


Tue,August 13, 2019 03:29 AM

-మతసామరస్యాన్ని చాటిన పండుగ
-హిందూ, ముస్లింల అలయ్‌బలయ్
-ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
-మతగురువుల భక్తి బోధనలు
-ఖుర్బానీ పంపిణీ
-నిరుపేదలకు దానాలు
-అల్లా దయతో అమాత్య స్థాయికి..
-రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక ప్రార్థనలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో ఉన్న మస్జీద్‌లు, ఈద్గాల్లో మస్జీద్ కమిటీల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ పూర్వీకులను స్మరించుకుంటూ పాతిహాలు ఇచ్చి సామూహిక భోజనాలను నిర్వహించారు. తెల్లవారకముందే ఫదర్ నమాజుల తర్వాత గ్రామ శివారుల్లోని ఈద్గాలకు చేరుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వయోభేదం లేకుండా పెద్దసంఖ్యలో ముస్లింలు ఈద్గాలకు హాజరయ్యారు. ఉదయం 9గంటలకు ఈద్గాలకు చేరుకున్న ముస్లింలు వారి మతగురువుల ఉపన్యాసాలను విన్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం కనిపించింది. రాయపర్తి మండల కేంద్రంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థలను మంత్రి చేశారు.

వారితో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు. తన గెలుపునకు ముస్లింలు ఎంతో సహకరించారన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో మంత్రినయ్యానని చెప్పారు. ముస్లింలకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి దయాకర్‌రావు ఈ సందర్భంగా తెలిపారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈద్గా మైదానంలో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరిత కలెక్టర్ ఎం హరిత ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక జరుపుకునే పండుగ బక్రీద్ అని ఆమె పేర్కొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...