రేపు టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ మహాసభలు


Tue,August 13, 2019 03:26 AM

న్యూశాయంపేట,ఆగస్టు12: టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రిజియన్ 9వ మమాసభలను హన్మకొండలోని పాపులర్ గార్డెన్‌లో బుధవారం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ తెలిపారు. సోమవారం బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ రవాణారంగంలో ఆర్టీసీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించకుండా అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో రీజియన్ అధ్యక్షుడు యాదగిరి, హన్మకొండ డిపో అధ్యక్షుడు ఎల్లయ్య, వరంగల్-1డిపో అధ్యక్షుడు విజయ్, వరంగల్-2డిపో కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...