టీఆర్‌ఎస్‌తోనే ముస్లింలకు గుర్తింపు


Tue,August 13, 2019 03:26 AM

పాలకుర్తి రూరల్ : టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే ముస్లింలకు తగిన గుర్తింపు లభిస్తుందని, వారి సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని పథకాలను చేపట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బక్రీద్ సందర్భంగా జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని బషారత్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విందులో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రంజాన్ పండుగకు పేద ముస్లింలకు ప్రభుత్వం కానుకలు అందజేస్తున్నదని గుర్తుచేశారు. ముస్లింలు పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ముస్లిం విద్యార్థుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకులాలు ఏర్పాటు చేసిందని, చదువులో రాణించాలన్నారు.

అల్లా దయతో అందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్యశర్మ, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అబ్బాస్ అలీ, బషీర్, ఎండీ సర్వర్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేడారపు సుధాకర్, పోగు శ్రీనివాస్, రాపాక అశోక్, తమ్మి రాంబా బు, కమ్మగాని నాగన్న, కడుదుల కరుణాకర్‌రెడ్డి, నోముల సతీష్, కమ్మగాని రమేశ్, చిదిరాల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...