అల్లా దయతో అభివృద్ధి


Tue,August 13, 2019 03:25 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ : అల్లా దయతో.. మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచా... సీఎం కేసీఆర్ చలువతో మంత్రిని అయ్యా అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జమామసీద్ ఆవరణలో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి దయాకర్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లా దయతో పాలకుర్తి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాన న్నారు. గతంలో ఏ పాలకులూ ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంక్‌గా వినియోగించుకున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ముస్లింలు విద్యాపరంగా ముందుకు సాగాలని రాష్ట్రవ్యాప్తంగా వందలాది మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘతన టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.

నిరుపేద ముస్లింలకు రంజాన్ పర్వదినం సందర్భంగా దుస్తులు, పండుగ సామగ్రి అందజేస్తున్నామన్నారు. తొర్రూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో సుందరీకరించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.50కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. పనులు ప్రగతి పథంలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మసీద్‌కు వచ్చేసిన మంత్రి దయాకర్‌రావును ముస్లింలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుర్పాటి చిన్న అంజ య్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, జమామసీద్ కమిటీ అధ్యక్షుడు ఎండీ జలీల్, అమీర్, యాకూబ్‌పాషా, ఇమామ్, గుం శావళి, గఫార్, షబీర్‌అలీ, సలామ్‌పాషా, దావూద్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...