చల్లాకు నేతల పరామర్శ


Tue,August 13, 2019 03:25 AM

పరకాల, నమస్తే తెలంగాణ/ శాయంపేట : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని సోమవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డి ఈ నెల 4న మృతిచెందగా సోమవారం శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి స్పీకర్ చేరుకుని మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు, ఎమ్మెల్సీ ఎన్ లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, వైస్ చైర్మన్ ఆకుల రవీందర్, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్, కలెక్టర్ ఎం హరిత, డీసీపీ కేఆర్ నాగరాజు, ఏసీపీ సునీతామోహన్, ఎల్‌ఐసీ ఏజెంట్ వరంగల్ డివిజన్ అధ్యక్షుడు పిన్నింటి సంపత్‌రావు, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ నాగేశ్వరరావు, సీఎం క్లబ్ మెంబర్ తాటికొండ వీరస్వామి, పరకాల బ్రాంచ్ అధ్యక్షుడు ఆకుల రవీందర్, బుర్ర బాబు, శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, సంగెం జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, పరకాల జెడ్పీటీసీ చిలువేరు మొగిళి, టీఆర్‌ఎస్ నాయకులు చింతం సదానందం, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, భాస్కర్, సుమన్, నందం, మహేందర్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు మల్లారెడ్డికి నివాళులర్పించారు. అలాగే, ఏసీబీ అధికారి జనార్దన్, ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు కూడా ధర్మారెడ్డిని పరామర్శించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...