దుగ్గొండి ఏపీఎంకు అంతర్జాతీయ యువజన అవార్డు


Tue,August 13, 2019 03:24 AM

దుగ్గొండి, ఆగస్టు 12 : అంతర్జాతీయ యువజన అవార్డుకు దుగ్గొండి మండ లం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గుజ్జు ల రాజ్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంతర్జాతీయ యు వజన దినోత్సవంలో పాల్గొని అవార్డు అందుకున్నట్లు రాజ్‌కుమార్ తెలిపా రు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఔనత్యాన్ని, గొప్పదనాన్ని, చరిత్రను చాటి చెప్పినందుకు గాను కేంద్ర క్రీడ లు, యువజన సంక్షేమ సంఘం ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించారు. అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా, అంతర్జాతీయ యువజన ఆవార్డుకు ఎంపికైన రాజ్‌కుమార్‌కు మండలాధికారులు, ఐకేపీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...