రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


Tue,August 13, 2019 03:24 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : ఇటీవల మానుకోట కరాటే అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ చూపి పతకాలను సాధించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా ట్రావెల్ వెల్ఫేర్ మీటింగ్ హాల్‌లో రెండో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. దీనిలో మిట్స్‌యాకామ్ షిటో రియో కరాటే సంస్థకు చెందిన విద్యార్థులు నలుగురు పాల్గొని పతకాలు సాధించారు. కటాలో అండర్-14 విభాగంలో గుంటి హేమచంద్రిక బంగారు పతకం సాధించారు. అండర్-12 విభా గం కుమితేలో గుంటి వర్షిత్ బంగారు పతకం సాధించారు. పి.హరీశ్‌కుమార్ కటాలో వెండి పతకం, ఎం సాత్విక్ కాంస్య పతకం సాధించినట్లు రచ్చ శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ రచ్చ భవానీచంద్, రచ్చ శ్రీనుబాబు, సందీప్ తదితరులు అభినందించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...