భద్రకాళీ ఆలయంలో శ్రీరుద్రయాగం


Tue,August 13, 2019 03:24 AM

మట్టెవాడ, ఆగస్టు 12: వరంగల్ నగరంలో ప్రసిద్ధ్దిగాంచిన శ్రీభద్రకాళీ ఆలయ ప్రాంగణంలో శ్రావణమాస సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రయాగాన్ని నిర్వ హించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ధీర్ఘాయురారోగ్యాలతో ఉండాలని ఆలయ ప్రధానార్చకులు శ్రీభధ్రకాళీ శేషు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వరుడికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈ యాగంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, రాష్ట్ర వికలాంగుల సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి పూజా నంతరం శేషవస్ర్తాలను బహూకరించి తీర్థప్రసాద వితరణ గావించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...