విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు సహకరించాలి


Mon,August 12, 2019 03:29 AM


దుగ్గొండి, అగస్టు11: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు సహకరించాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ అన్నారు. మండలంలోని గిర్నిబావిలో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం టీ విత్ ప్రిన్సిపాల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవేందర్ హాజరై విద్యార్థులు వారి తల్లిదండ్రులలతో మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకునేలా తల్లిద్ంరడ్రులు ప్రోత్సహించాలన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల అందిస్తున్న విద్యాసేవలు, వసతులను వివరించారు. తల్లిదండ్రులు తరగతులు నడుస్తున్న సమయంలో వచ్చి వారికి ఆటంకం కలిగించవద్దన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో మాదిరిగా గురుకులంలోని ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ.80 వేల వరకు ఖర్చు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మానస, శ్రీదేవి, కోటి, శ్రీనివాస్, పీఈటీ బాబు, రమేశ్, ప్రేమలత, రోజా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...