నేటి నుంచి నర్సంపేటలో ఉర్సు


Mon,August 12, 2019 03:28 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేట పట్టణం మల్లంపల్లి రోడ్డులోని హజరత్ సయ్యద్ జమా లేబహర్ ఉర్సును సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు మహ్మద్ ముర్షద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం రాత్రి 8 గంటలకు గంధం(సందల్) కార్యక్రమం చెప్పారు. నర్సంపేటలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, రాత్రి ఒంటి గంట వరకు మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు 13న రాత్రి ఖందిల్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఖవ్వాలీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఖవ్వాలి, గంధం, ఖందిల్ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...